సాగరతీరంలో పోలీసుల మాక్‌డ్రిల్
కోడూరు: ఉగ్రవాదులు, తీవ్రవాదుల ఆచూకీని గుర్తించేందుకు హంసలదీవి సాగరతీరం వెంట పోలీసులు శుక్రవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. కోస్టల్ అధికారుల ఆదేశాల మేరకు తీరంలో సాగర్ కవచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీలు జి.బాలిరెడ్డి, సీహెచ్ రాజా ఆధ్వర్యంలో పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి పర్యవేక్షణలో 50 మంది పోలీసులు కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. కోస్టల్ పోలీసులు, నేవీ అధికారుల్లో కొందరు ఉగ్రవాదులు, తీవ్రవాదుల రూపంలో వచ్చి తీరప్రాంత గ్రామాల్లోని దాక్కోగా, వీరిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక పడవల ద్వారా సముద్రమార్గం వెంట సంచరించారు. సముద్రంలో వేటాడుతున్న పడవులను కూడా తనిఖీ చేశారు. పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, రామకృష్ణాపురం గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అపరిచిత వ్యక్తుల వివరాలను సేకరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల ఐడీ కార్డులను పరిశీలించడంతో పాటు వారికి కూడా అనుమానితులను గుర్తించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్ శనివారం కూడా కొనసాగుతుందని సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐలు ఉజ్వల్‌కుమార్, పూర్ణమాధురి, అవనిగడ్డ సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.
సాగరతీరంలో పోలీసుల మాక్‌డ్రిల్
సాగరతీరంలో పోలీసుల మాక్‌డ్రిల్


