కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. మచిలీపట్నం మండలం భోగి రెడ్డిపల్లి గ్రామంలో కలెక్టర్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న గోనె సంచులు, రవాణా వాహనాలు, నమోదవుతున్న తేమ శాతంపై ఆరా తీశారు. రానున్న వారంలో వరి కోతలు ముమ్మరమయ్యే అవకాశం ఉందని, అవసరమైనన్ని గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో గందరగోళానికి తావు లేకుండా చూడాలన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కోతలు కోయించాలని, పంట పక్వానికి రాకుండా ముందు గానే కోయించి దిగుబడి విషయంలో నష్టపోవద్దని సూచించారు. భోగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన పలు రహదారుల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఈ ఎన్.వి.రమణ రావు, డెప్యూటీ డీఈఈ మోజెస్, మచిలీపట్నం దక్షిణ మండల తహసిల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: డీఈఎల్‌ఈడీ మడ్డో సంవత్సరం (3వ సెమిస్టర్) 2024–2026 బ్యాచ్ రెగ్యులర్, వొకసారి ఉత్తీర్ణులు కాని (2022 –24, 2023–25 బ్యాచ్) అభ్యర్థులకు డిసెంబర్ 15 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతా యని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి పి.వి.జె.రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రోజూ ఉదయం తొమ్మిది నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. డిసెంబర్ 15న ప్రాథమిక స్థాయి ఇంగ్లిషు బోధన శాస్త్రం–1, 16న ప్రాథమిక స్థాయి పర్యావరణ విజ్ఞానం బోధన శాస్త్రం–ఐ, 17న ఎలిమెంటరీ స్థాయి ఐచ్చిక విషయం–ఐ బోధన శాస్త్రం, 18న భారతదే శంలో సమకాలీన విద్య–ఐ, 19న విద్యలో లింగ సమానత్వం, సమగ్ర దృక్పథాల సమీకరణ, 20న పాఠశాల సంస్కృతి, నాయకత్వం, గురువుల అభివృద్ధి పరీక్షలు జరుగుతాయని డీఈఓ రామారావు వివరించారు.


