ఓ పోలీ... స్వర్గానికి పోయిరా!
నాగాయలంక కృష్ణాతీరంలో శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్ వద్ద శుక్రవారం భక్తులు కార్తిక వత్తులు వెలిగించిన అరటి డొప్పలను కృష్ణమ్మ ఒడిలో వదిలి ఈ‘ఏటి’కి పోయిరావమ్మా పోలీ...స్వర్గధామానికి అంటూ పోలిస్వర్గం పూజలు చేసి వీడ్కోలు పలికారు. వేలాదిమంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు చేసి, పూజలు చేసి, నదిలో పూజాద్రవ్యాలను సమర్పించారు. ఘాట్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి భారీ శివలింగానికి భక్తులు బారులు తీరి నదీ జలం, పాలతో స్వీయ అభిషేకాలు చేసుకున్నారు.
– నాగాయలంక


