ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలు

Nov 21 2025 6:58 AM | Updated on Nov 21 2025 6:58 AM

ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలు

ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలు

ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలు

పమిడిముక్కల: హనుమంతపురం– కనుమూరు రహదారిపై ముళ్లపూడి ములుపు వద్ద గురువారం జరిగిన ఆటో ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, దాసరిపాలెం గ్రామానికి చెందిన 12 మంది కూలీలు ఆటోలో పమిడిముక్కల మండలం ముళ్లపూడి గ్రామంలో వరికోతలకు వెళుతున్నారు. ముళ్లపూడి వద్ద ఆటో ప్రమాదవశాత్తూ పక్కకు ఒరిగిపోవడంతో ఆటోలోని 9 మందికి గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురికి స్వల్ప గాయాలవడంతో చికిత్స చేయించుకొని స్వగ్రామం వెళ్లిపోయారు. ఇరువురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీను తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement