మోడల్‌ మండల సమాఖ్యలు ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ మండల సమాఖ్యలు ఆదర్శనీయం

Nov 21 2025 6:58 AM | Updated on Nov 21 2025 6:58 AM

మోడల్‌ మండల సమాఖ్యలు ఆదర్శనీయం

మోడల్‌ మండల సమాఖ్యలు ఆదర్శనీయం

మోడల్‌ మండల సమాఖ్యలు ఆదర్శనీయం

వెలుగు కృష్ణా జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వై.హరిహరనాథ్‌

గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లాలో మొదటి విడతగా గుర్తించిన ఎనిమిది మోడల్‌ మండల సమాఖ్యలు మిగిలిన మండలాలకు ఆదర్శనీయంగా నిలిచాయని వెలుగు జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వై.హరిహరనాథ్‌ అన్నారు. గురువారం ఆయన గుడ్లవల్లేరు సీ్త్ర శక్తి భవనంలో గుడ్లవల్లేరుతో పాటు తోట్లవల్లూరు, బంటుమిల్లి, గన్నవరం, నాగాయలంక, పెదపారుపూడి, ఘంటసాల, నందివాడ మండల సమాఖ్యలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం పిఠాపురంలో శిక్షణ పొందిన రిసోర్స్‌ పర్సన్స్‌ నర్రా సత్యభామ, మహంకాళ రావు, శ్రీదేవి శిక్షణ ఇచ్చారు. గ్రామ, మండల సమాఖ్యల ఇతర కార్యక్రమాలతో పాటుగా 2026–27 సంవత్సరానికి గాను ఆర్థిక ప్రణాళిక, మాస్‌ ఏసీ సభ్యులు ప్రణాళిక తయారు చేస్తారని డీపీఎం సత్యభామ తెలిపారు. శనివారం వరకు ఈ శిక్షణ ఉంటుందని ఏపీఎం చెప్పారు. శిక్షణలో అన్ని 41గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, 8 మండలాల ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement