సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం

Nov 20 2025 7:02 AM | Updated on Nov 20 2025 7:02 AM

సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం

సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): చంద్రబాబు ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. విధులు నిర్వహించిన సచివాలయానికి సిబ్బంది కనీసం తాళాలు కూడా వేయకుండా వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలోని 5వ సచివాలయంలో జరిగింది. ఈ సచివాలయ భవనం పైనే సచివాలయం–2, మెప్మా కార్యాలయాలు కూడా ఉన్నాయి. రాత్రి 11 గంటలకు గస్తీ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు సచివాలయం తలుపులు తెరచి ఉండడం గమనించి లోపలకు వెళ్లారు. లోపల ఎవరూ లేకపోవడంతో దొంగతనం జరిగిందమో అని అనుమానించిన ఎస్‌ఐ పోలీస్‌ సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. వారు చేరుకుని విచారించగా, కార్యాలయ సిబ్బంది తాళాలు వేయకుండా వెళ్ళిపోయారని గుర్తించారు. కొండపల్లి మున్సిపాలిటీ సిబ్బందికి సమాచారమిచ్చారు. తాళాలు వేయక పోవడంపై ఒకరిపై ఒకరు తప్పును ఎత్తిచూపుకున్నారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తన దృష్టికి ఈ విషయం చేరడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచివాలయ సిబ్బందిపై చర్యలకు సిద్ధమయ్యారు. విషయాన్ని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, సచివాలయ శాఖ ఉన్నత అఽధికారులకు సమాచారం అందించారు.

తాళాలు వేయకుండా వెళ్లిన ఉద్యోగులు

రాత్రి 11 గంటలకు గుర్తించిన

ఎస్‌ఐ లక్ష్మణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement