స్వామివారి సన్నిధిలో ప్రముఖులు
మోపిదేవి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న కృష్ణాజిల్లా మోపిదేవిలో వేం చేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, కృష్ణాజిల్లా విశ్రాంత ఐఏఎస్, ఐఎన్‌ఓ ఆర్‌ఓపీ(ఇన్ రోప్) ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ ఇండస్ట్రీస్ ఎల్‌అండ్‌ఎం స్టార్ట్ ఆఫ్ డైరెక్టర్ లక్ష్మీకాంతం దంపతులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కుటుంబ సమేతంగా విడివిడిగా మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వారు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, స్థానిక టీడీపీ నాయకులు, ఆలయ అధికారులు, ఎస్‌ఐ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


