ట్యాంకర్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

Nov 17 2025 10:07 AM | Updated on Nov 17 2025 10:07 AM

ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

ట్యాంకర్‌ను ఢీకొన్న కారు

కారులో నుంచి వ్యాపించిన అగ్నికీలలు

తప్పిన పెద్ద ప్రమాదం

కంచికచర్ల: బైక్‌ను ఢీకొట్టిను కారు ముందు వెళ్లుతున్న ట్యాంకర్‌ను ఢీకొనగా కారులో నుంచి అగ్నికీలలు రావటంతో ప్రయాణికులు కిందకు దిగటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు స్వల్పంగా కాలింది. ఘటన ఆదివారం కంచికచర్ల మండలం కీసర పొగాకు బోర్డు సమీపంలో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వినాయక్‌ భార్య ఉషతో కలసి విజయవాడ వైపునకు కారులో బయలుదేరారు. కంచికచర్ల మండలం కీసర పొగాకు బోర్డు సమీపంలోకి రాగానే కారు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొని అనంతరం ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్లుతున్న నందిగామకు చెందిన సుబ్బారావుకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం కారులో నుంచి మంటలు వ్యాపించటంతో కారులో ప్రయాణిస్తున్న వినాయక్‌, ఉష కిందకు దిగారు.

ఒక్కసారిగా పొగతో పాటు మంటలు రావటంతో సమాచారం అందుకున్న టోల్‌ప్లాజా అగ్ని మాపక కేంద్ర సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వినాయక్‌, ఉషలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement