ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి
జగ్గయ్యపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బూదవాడ రోడ్డులో శనివారం అర్ధరాత్రి జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన తుమ్మా బుచ్చిబాబు (35) ఫోటో స్టూడియో ఆల్బమ్ డిజైనర్. ఈ క్రమంలో రాత్రి సమయంలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలోని పాఠశాల కార్యక్రమంలో ఫొటోలు తీసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. అతని వాహనం, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఘటనలో బుచ్చిబాబు అక్కడికక్కడే మృతి చెందగా బూదవాడకు చెందిన చేతుల నాగరాజుకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు.


