అక్రమ నిర్మాణాలకు అడ్డేది ! | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలకు అడ్డేది !

Nov 14 2025 8:57 AM | Updated on Nov 14 2025 8:57 AM

అక్రమ నిర్మాణాలకు అడ్డేది !

అక్రమ నిర్మాణాలకు అడ్డేది !

అక్రమ నిర్మాణాలకు అడ్డేది ! పెనమలూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనధికార భవన క్రమబద్దీకరణ పథకం–2025(బీపీఎస్‌) ఎవరికి లాభం అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం ఒక పక్క బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలు ప్రకటించి, ఖజానాకు సొమ్ము సమకూర్చుకోవటానికి చర్యలు చేపట్టింది. అయితే నాయకులు, అఽధికారుల అండదండలతో రియల్టర్లు, బిల్డర్లు మాత్రం నిబంధనలు తుంగలోకి తొక్కి నేటికీ అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుటులు అక్రమ దందా చేస్తూనే ఉన్నారు. దీని కారణంగా ప్రభుత్వ ఆదాయానాకి భారీ గండి పడుతోంది. ఈ పరిస్థితిలో బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ వలన ప్రభుత్వానికి వచ్చే లాభం కంటే నష్టమే అధికంగా కనబడుతోంది.. కృష్ణాజిల్లా తాడిగడప మున్సిపాలటీ పరిధి యనమలకుదురు, కానూరు, పోరంకి, తాడిగడప ప్రాంతాల్లో అనధికార కట్టడాలు వేల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన బీపీఎస్‌ పథకం 1985 సంవత్సరం తరువాత జరిగిన నిర్మాణాలకు అమలు చేస్తామని ప్రకటించింది. ఈ లెక్కన తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అనధికార నిర్మాణాలు 15 వేలకు పైగానే ఉంటాయని అంచనా. అయితే వీటి క్రమబద్దీకరణకు అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే..

హెచ్చరికలతో సరి.. చర్యలు లేవు మరి..

ప్రభుత్వం బీపీఎస్‌ ప్రకటించినందున ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ తరువాత అనధికార నిర్మాణాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినా తాడిగడప మున్సిపాలటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో అదనపు ఫ్లోర్‌లు, భవన డీవియేషన్‌లు కొనసాగుతున్నాయి.

తాడిగడప మున్సిపాలిటీలో

లెక్క తేలని అనధికార కట్టడాలు

ప్రభుత్వ ఆదాయానికి గండి..

బీపీఎస్‌తో నాయకులు,

అధికారులకు కాసుల పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement