కృష్ణా తీరం దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మింది. నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్ కార్తిక కాంతులతో కొత్త కళను సంతరించుకుంది. గురువారం రాత్రి క్షేత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవం వైభవంగా సాగింది. యావత్ పుష్కరఘాట్‌తో పాటు క్షేత్ర సముదాయంలోని రామాలయం, కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగాణాలు భక్తజనంతో కిక్కిరిశాయి. వేలాది మంది తరలివచ్చి దీపోత్సవంలో పాల్గొని, మట్టి ప్రమిదలలో కోటి వత్తులను సమకూర్చి జ్యోతులు వెలిగించి మురిసిపోయారు. – నాగాయలంక
కృష్ణమ్మకు దీప నీరాజనం


