రోడ్డు ప్రమాదంలో బైక్ మెకానిక్ దుర్మరణం
పెడన: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో మెకానిక్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం 216 జాతీయ రహదారిపై పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పెడన పట్టణం తోటమూలకు చెందిన పూల బ్రహ్మం(50) బైక్ మెకానిక్. బుధవారం మధ్యాహ్నం బల్లిపర్రు కాలనీలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పెడన నుంచి బంటుమిల్లి వైపుగా వేగంగా వెళ్తున్న కారు బ్రహ్మం ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. బ్రహ్మం తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన మచిలీపట్నం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పెడన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో ఇంజనీరింగ్ విద్యార్థులున్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు.


