దేశంలో అగ్రగామిగా యూనియన్‌ బ్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

దేశంలో అగ్రగామిగా యూనియన్‌ బ్యాంక్‌

Nov 13 2025 7:44 AM | Updated on Nov 13 2025 7:44 AM

దేశంలో అగ్రగామిగా యూనియన్‌ బ్యాంక్‌

దేశంలో అగ్రగామిగా యూనియన్‌ బ్యాంక్‌

రీజనల్‌ మేనేజర్‌ వెంకట్రావు

చిలకలపూడి(మచిలీపట్నం):దేశంలోనే పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో అగ్రగామిగా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్థానం సాధించిందని బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ కె.వెంకట్రావు తెలిపారు. జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌ హాలులో బ్యాంకు 107వ స్థాపన దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో తమ బ్యాంకు ద్వారా ఎంతో మందికి రుణాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించామన్నారు. తమ బ్యాంకు సాధించిన విజయాలన్నీ వినియోగదారులకే అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ డెప్యూటీ రీజనల్‌ హెడ్‌ రామలింగారెడ్డి, దాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement