శంకుస్థాపనకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి డుమ్మా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ఇంటికో పారిశ్రామిక వేత్త’ నినాదంతో మైలవరం మండలం, చండ్రగూడెం గ్రామంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్‌గా హాజరై శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇటీవల వీటీపీఎస్ బూడిద రవాణాపై తన పెత్తనం చెల్లకపోవడంపై నియోజకవర్గ ప్రజాప్రతినిధి రగిలిపోతున్నట్లు తెలిసింది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రభుత్వంపై అసమ్మతి రాగం అందుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తన నిరసన గళం వినిపించేందుకే శంకుస్థాపనకు హాజరు కాలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధి హాజరు కాకపోవ డంతో ఆ తంతును విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, తహసీల్దార్ అబ్దుల్‌దరియా, ఎంపీడీఓ అనూరాధ పూర్తి చేశారు.
వీటీపీఎస్ బూడిద అంశంలో తన మాట చెల్లుబాటు కాలేదని అసహనం


