చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ–కోసం)లో ఫిర్యాదులుచేసే అర్జీదారులకు సరైన సమాధానం పంపి, ఆ సమస్య కోసం మరలా దరఖాస్తు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మీ–కోసం అర్జీల పరిష్కారంపై ఆడిట్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు అంశాలను వివరించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లా, మండలస్థాయి అధికారులు వారి పరిధిలోని మీ– కోసం అర్జీలపై సజావుగా సమాధానాలు ఇస్తున్నప్పటికీ స్వయంగా మాట్లాడకపోయినా, సమాధాన మివ్వకపోయినా, మర్యాదగా మాట్లాడకపోయినా లోట్లు పాట్లు ఉంటే మరలా ఆ అర్జీ తిరిగి పరి ష్కారం కానట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. సంతృప్తికరంగా సమాధానం ఇచ్చినప్పటికీ తిరిగి ఆ అర్జీ సమస్య పరిష్కారం కాలేదని మరలా అప్‌లోడ్ చేయడం ద్వారా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పోలీస్‌శాఖలో అర్జీదారులకు సమాధానం చదివి వినిపించి సంతకం తీసుకుంటున్నారే తప్ప వాటిని అర్జీదారునికి అందజేయడం లేదని ఫిర్యా దులు వస్తున్నాయ ని పేర్కొన్నారు. అలా జరగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏఎస్పీ వి.వి.నాయుడు, డీపీఓ జె.అరుణ పాల్గొన్నారు.


