మాజీ ఎమ్మెల్యే కై లేకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కై లేకు నోటీసులు

Nov 12 2025 5:39 AM | Updated on Nov 12 2025 5:39 AM

మాజీ ఎమ్మెల్యే కై లేకు నోటీసులు

మాజీ ఎమ్మెల్యే కై లేకు నోటీసులు

పామర్రు: తమ పార్టీ మహిళలపై పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే ప్రశ్నించినందుకు తనపై కేసులు బనాయించడమే కాకుండా స్టేషన్‌కు రావాలంటూ నోటీసులు ఇవ్వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కేసులకు తెగబడుతుంటే ఇదేమిటని అడిగినందుకు అడ్డగోలుగా కేసులు పెట్టి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల నాలుగో తేదీన పామర్రు నియోజకవార్గనికి వచ్చారు. ఆయనను చూసేందుకు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం అడ్డరోడ్డు వద్ద వేలాదిగా మహిళలు వచ్చారు. వీరిని చూసి కూటమినేతలు ఓర్వలేక పోలీసుల సహకారంతో ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని, వెళ్లని పక్షంలో వారిపై లాఠీచార్జి చేయాలని ఆదేశించారు. వారి ఆదేశాలను తు.చ. తప్పకుండా పోలీసులు పాటించారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ మహిళలపై ఎందుకలా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. అందుకు వారు మీకు చెప్పాల్సిన అవసరం లేదని, ఈ ప్రాంతం అంతా ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కై లేకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇదే అవకాశంగా భావించిన టీడీపీ నేతలు పమిడిముక్కల మండలం సీఐను ప్రోత్సహించి అనిల్‌కుమార్‌పై కేసులు బనాయించాలని ఆదేశించారు. నాలుగో తేదీ సాయంత్రం తమ విధులకు ఆటంకం కలించారంటూ అనిల్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయానికి పోలీసులు వచ్చి శనివారం పమిడిముక్కల మండలంలోని స్టేషన్‌కు రావాలంటూ నోటీసులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement