మాతృ మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

మాతృ మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి

Oct 18 2025 9:51 AM | Updated on Oct 18 2025 9:51 AM

మాతృ

మాతృ మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి

మాతృ మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో మాతృ మరణాల నివారణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వైద్యాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించి ప్రసూతి మరణాలపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ముఖ్యంగా హైరిస్క్‌ ప్రెగ్నెంట్‌ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు వారి పరిధిలోని గర్భిణుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నప్పటికీ అవసరమైన వైద్య పరీక్షలు, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వాడుతున్నదీ, లేనిదీ ఆరా తీయాలని చెప్పారు. తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రత్యేక జీవనశైలి విధానంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో ఎ.వెంకట్రావు, డీసీహెచ్‌ఎస్‌ శేషుబాబు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రేమ్‌చంద్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి అనుమానాస్పద రీతిలో రైల్వే ఉద్యోగి మృతి

కలెక్టర్‌ డీకే బాలాజీ

మోపిదేవి: అనారోగ్యంతో బాధపడుతూ సకాలంలో వైద్యం అందక ఏపీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ఆరేవరపు భార్గవ్‌ (11) మృతి చెందాడు. కోడూరు మండలంలో ఊటగుండం గ్రామానికి చెందిన భార్గవ్‌ మోపిదేవి గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జలుబు, దగ్గుతో తీవ్ర ఇబ్బంది పడిన బాలుడికి హాస్టల్స్‌లోనే చికిత్స అందించారు. తగ్గకపోవడంతో బాలుడి తండ్రికి సమాచారం ఇచ్చారు. ఆయన ఈ నెల 15వ తేదీ సాయంత్రం బాలుడిని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడ వైద్యుల సూచన మేరకు మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ వీరరవిని వివరణ కోరగా 14, 15 తేదీల్లో రెండు రోజులపాటు దగ్గు, జలుబుకు పాఠశాలలోనే చికిత్స అందించామని చెప్పారు. అయినా తగ్గకపోవడంతో బాలుడిని తండ్రికి అప్పగించినట్లు తెలిపారు. బయట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 16వ తేదీ మృతి చెందినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ):కడుపునొప్పి, నీరసంతో రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉద్యోగి మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నున్న సమీపంలోని బోడపాడుకు చెందిన డి.ఉషారాణి, నాగమహేష్‌లు భార్యాభర్తలు. నాగమహేష్‌ రైల్వే లోకో షెడ్డులో ఉద్యోగం చేస్తుంటాడు. గురువారం రాత్రి నాగమహేష్‌ డ్యూటీకి బయలుదేరి వచ్చాడు. రాత్రి 3 గంటల సమయంలో కడుపులో నొప్పి, నీరసంగా ఉందని చెప్పి ఇంటికి బయలుదేరాడు. శుక్రవారం ఉదయం ఉషారాణికి రైల్వే ఆఫీసు నుంచి ఫోన్‌ రాగా, రాత్రి ఇంటికి బయలుదేరిన నాగమహేష్‌ పైపుల రోడ్డు పెట్రోల్‌ బంక్‌ వద్ద రోడ్డు పక్కన పడిపోవడంతో రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో ఉషారాణి హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి రాగా రాత్రి జరిగిన విషయాన్ని చెప్పారు. అయితే అప్పటికే చికిత్స పొందుతూ నాగమహేష్‌ మృతి చెందినట్లు పేర్కొనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మాతృ మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి 
1
1/1

మాతృ మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement