రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతోంది. నిజాన్ని నిర్భయంగా ప్రచురించే స్వేచ్ఛ పత్రికలకు ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకువస్తూ వార్తలు రాసే పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టి కలానికి సంకెళ్లు వేయాలనుకోవటం అవివేకం. మీడియా విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాన్ని ఏపీయూడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నకిలీ మద్యం వ్యవహారంలో చర్యలు తీసుకోలేని పోలీసులు వాస్తవాలు ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెట్టడం సహేతుకం కాదు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను భయపెట్టే ధోరణికి స్వస్తి పలకాలి.
– చలమలశెట్టి రమేష్‌బాబు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణాజిల్లా కన్వీనర్