
దుర్గమ్మకు వజ్రాభరణాలు
శుక్రవారం తెల్లవారుజామున అలంకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ప్రముఖ జ్యూయలర్స్ సంస్థ కీర్తిలాల్ జ్యూయలర్స్ వారు గురువారం బంగారు, వజ్రాభరణాలను కానుకగా సమర్పించారు. సుమారు రూ.2కోట్ల విలువైన 531 గ్రాముల బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలతో కూడిన సూర్యుడు, చంద్రుడు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, మంగళ సూత్రాలు, బంగారు గొలుసు వంటి ఆభరణాలను దాతలు గురువారం రాత్రి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. తొలుత దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులకు వాటిని అందజేశారు. శుక్రవారం ఈ వజ్రాభరణాలను అమ్మవారికి అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కీర్తిలాల్ జ్యూయలర్స్‌కు చెందిన సూరజ్ శాంతకుమార్, కీర్తిలాల్ కాళిదాస్, తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీరవి, గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు వజ్రాభరణాలు

దుర్గమ్మకు వజ్రాభరణాలు