
కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
బినామీల మాటున 38 ఎకరాల
స్వాధీనానికి కుటిల యత్నాలు
రూ.11.50 కోట్ల ఆస్తి కోసం
మంత్రి పన్నాగాలు
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా తప్పుడు పత్రాల సృష్టి
అక్రమంగా నరికేసిన రూ.80 లక్షల విలువైన సరుగుడు తోటలు
ఎకై ్సజ్, పోలీస్ ద్వారా రైతులపై
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
రాజీల పేరిట అంతు చూస్తామంటూ బెదిరింపులు
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
న్యాయం కోసం పోరాడతా
రైతుల భూముల జోలికొస్తే వదలం
కొనుగోలుదారులంతా మంత్రికి అయినవారే...
శుక్రవారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఇంద్రకీలాద్రిపై రానున్న కార్తిక మాసంలో జరిపే విశేష పూజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ తెలిపారు. –IIలో
విమానాశ్రయం(గన్నవరం): తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్.రవి విజయవాడ పర్యటన నిమిత్తం గురువారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు.
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మచిలీపట్నంలోని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎండూరి శేష బాపనలాల్, పూర్ణచంద్రిక, రవీంద్రమూర్తి రక్త సంబంధీకులు. వారికి చిన్నగొల్లపాలెంలో తల్లి దండ్రుల నుంచి 167 ఎకరాలు సంక్రమించింది. 1941వ సంవత్సరం నుంచి ఎండూరి కుటుంబం స్వానుభవంలో ఉన్న 213, 217, 572/1 సర్వే నంబర్లలోని 52.76 ఎకరాల విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. తన బృందం ద్వారా కొల్లు రవీంద్ర 2014–19 మధ్య కాలంలోనూ, తాజాగా కూటమి ప్రభుత్వంలో ప్రయత్నాలు ఈ భూమిని కాజేసే యత్నాలు కొనసాగిస్తున్నారు. ఎండూరి శేషబాపనలాల్ 2011 జూలైలో మరణించగానే 2012లో మచిలీపట్నానికే చెందిన గంపల కస్తూరి అనే మహిళను రంగప్రవేశం చేయించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల ద్వారా ఆమెను లాల్ భార్య అంటూ ఇంటి పేరును సైతం మార్పించి రెవెన్యూ కార్యాలయం నుంచి 39.70 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్‌ను ఇప్పించగలిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లాల్ తల్లి ఎండూరి సీతామహాలక్షుమమ్మ 2014 ఆగస్టులో రెవెన్యూ కోర్టులో కేసు దాఖలు చేశారు. కుమారుడి ద్వారా పొందిన వీలునామా తదితరాలను సాక్ష్యాలుగా పొందుపరిచారు. కాలక్రమంలో చిన్న కుమారుడైన ఎండూరి రవీంద్రమూర్తికి తల్లి సీతామహా లక్షుమమ్మ వీలునామా రాశారు. ఆమె తదనంతరం రెవెన్యూ కోర్టులో మూర్తి ఇంప్లీడ్ అయ్యారు. ఈ కేసు కొనసాగుతున్న దశలోనే 2016 ఆగస్టులో గంపల కస్తూరి వివాదరహిత భూమిగా పేర్కొంటూ ఆరుగురికి సేల్ డీడ్ ద్వారా, మరొకరికి గిఫ్ట్ డీడ్ ద్వారా 38 ఎకరాలను విక్రయించారు. 1.70 ఎకరాలను పంచాయతీ దారి కోసం రాసిచ్చారు. అప్పుడు కొల్లు రవీంద్ర మంత్రిగా కొనసాగుతున్నందునే ఈ విక్రయ ప్రక్రియ సాధ్యమైందని బాధితవర్గం ఆరోపిస్తోంది.
సరుగుడు తోటలు నరికేశారు...
చిన్నగొల్లపాలెంకు చెందిన పెద్ది సత్యనారాయణ, చందు సత్యనారాయణ 2011 నుంచి వివాదాస్పద భూమితో పాటు రవీంద్రమూర్తికి చెందిన మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని మొత్తం 53.76 ఎకరాలలో సరుగుడు తోటలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అండదండలతో భూ కొనుగోలుదారులమంటూ ఈ ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన, తాజాగా సెప్టెంబరు 22 నుంచి ఈనెల ఆరో తేదీ వరకు 19 ఎకరాల్లోని తోటలు నరికేశారు. నరికేసిన 900 టన్నులకు పైగా కలప విలువ దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుందని కౌలురైతులు వాపోతున్నారు.
రైతులపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
తమ తోటలు నరకొద్దని అడ్డుపడిన రవీంద్రమూర్తి తో పాటు 12 మంది రైతులపై ఫిబ్రవరిలో కృత్తివెన్ను పోలీసులు కేసు నమోదుచేశారు. మచిలీ పట్నం నుంచి వెళ్లి దౌర్జన్యంగా కోర్టు పరిధిలో ఉన్న తోటలు నరికేసిన రౌడీల జోలికి పోలీసులు వెళ్లక పోవడం వెనుక ఎవరున్నారనేది విదితమే. ఆర్డీవో, డీఎస్‌పీలు గ్రామానికి వెళ్లి మీకు మేలు చేస్తామనడం వరకే పరిమితమయ్యారు. పది నెలలు అవుతున్నా పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడం గమనార్హం. మంత్రి చెప్పినట్టు వినండి, ఆ భూముల వద్దకు వెళ్లకండి, లేదంటే మీ సంగతి తేలుస్తామనే పోలీసుల బెదిరింపులకు నెలల తరబడి గ్రామాన్ని వదిలి తలదాచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని బాఽధిత రైతులు వాపోయారు.
అక్రమంగా రెండు సారా కేసులు
భూమి తనకు చెందుతుందని కోర్టుకు వెళ్లిన రవీంద్రమూర్తిపై గత టీడీపీ హయాంలో అక్రమంగా రెండు సారా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసుల నుంచి బయటపడినట్లు బాధితుడు తెలిపారు.
పెడన ఎమ్మెల్యే కాగిత హెచ్చరికలు...
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మంత్రి తరఫున మాట్లాడుకుందాం రండని చినగొల్లపాలెం బాధిత రైతులను ఫిబ్రవరి నుంచి పలుసార్లు పిలిపించి చెప్పినట్లు వింటే మీపై కేసులు లేకుండా చూస్తానని, ఎదురుచెపితే కటకటాలు తప్పవని హెచ్చరించినట్టు బాధితులు చెబుతున్నారు.
సెటిల్‌మెంట్‌కు భీమవరం ఎమ్మెల్యే వద్దకు...
భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు స్వగ్రామం చినగొల్లపాలెం. రైతులకు సర్ది చెప్పి సెటిల్ చేయాలని మంత్రి రవీంద్ర ఆయనకు సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా భూమిని తమకు వదిలేసి వెళ్లిపోవాలని కొల్లు బృందం కోరడాన్ని ఎమ్మెల్యే అంజిబాబు తప్పు పట్టి ఎటూ తేల్చకుండా పంపించేశారని సమాచారం.
టీజీ వెంకటేష్, సోము వీర్రాజుల జోక్యం...
తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం గురించి రవీంద్రమూర్తి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. చినగొల్లపాలెం రైతులకు అన్యాయం జరుగుతోందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు సోము వీర్రాజుకు వివరించగా ఆయన పోలీసు అధికారులకు ఫోన్ చేసి చట్టప్రకారం వెళ్లాలని, లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని అన్నారని సమాచారం.
I
మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని కొల్లు రవీంద్ర హద్దు లేని అరాచకాలకు పాల్పడుతున్నారనే తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. కుటుంబ తగాదాలు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తిపాస్తులను కాజేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంధువులు, బినామీల మాటున ఈ అడ్డగోలు వ్యవహారాలకు ఒడిగడుతున్నారని, ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సామ దాన భేద దండోపాయాల వినియోగానికి ఏమాత్రం వెనుకాడటంలేదని స్థానికులు అంటున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో రూ.11.50 కోట్లకు పైగా విలువ చేసే 38 ఎకరాల భూమిని కాజేయడానికి దశాబ్దకాలంగా కొనసాగిస్తున్న అరాచకపర్వం ఇందుకు తార్కాణమని ఉదహరిస్తున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెంగళూరు వెళ్లి నా కుమార్తె కుటుంబాన్ని బెదిరించారు. నా కుమారుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నా పైనా, రైతుల పైనా తప్పుడు కేసులు పెట్టారు. ఏంచేసినా సరే న్యాయం జరిగే వరకు పోరాడతా.
– ఎండూరి రవీంద్రమూర్తి, మచిలీపట్నం
మంత్రి కొల్లు అయినా.. మరెవరైనా సరే రైతుల భూములను లాగేసుకోవా లని చూస్తే ఊరుకోం. రవీంద్రమూర్తి విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడాం.
– వల్లభనేని ఆశాకిరణ్, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర కోశాధికారి
భూమిని కొనుగోలు చేశామంటున్న వారందరూ మచిలీపట్నం వాసులే. వారిలో మంత్రి కొల్లు రవీంద్ర చినమామ నడకుదిటి అర్జున సర్వే నంబరు 213లో 11.30 ఎకరాలు, మంత్రి బాబాయ్ కుమారుడు కొల్లు రంగనాఽథ్ 571/1లో అయిదు ఎకరాలు, మంత్రి కొల్లు బినామీలుగా స్థానికంగా బాగా గుర్తింపు ఉన్న ఊకంటి రాంబాబు 572/1లో 5 ఎకరాలు, పైడిపాటి త్రినాథ్ 217లో 5 ఎకరాలు, కొల్లూరి సూర్య చంద్ర భగవాన్ గుప్త 217లో 5 ఎకరాలు, శ్రవణం పవన్‌కుమార్ 3.70 ఎకరాలు కొను గోలుదారులు. కాగా గిఫ్ట్ డీడ్ కింద పొన్నుగంటి చంద్రమౌళి 3 ఎకరాలు పొందారు.

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా