
నాగుల చవితి వేడుక జయప్రదం చేయండి
మోపిదేవి: నాగుల చవితి పర్వదినాన్ని విజయవంతం చేయాలని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు కోరారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 25వ తేదీ నాగుల చవితి సందర్భంగా పలుశాఖల అధికారుల సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ ఎం.హరనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ వరప్రసాదరావు మాట్లాడుతూ దేవస్థానం తరపున భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, నాగపుట్ట, గుడి మండపం వద్ద చాందినీ డెకరేషన్, లడ్డూ ప్రసాదం భక్తులందరికీ అందుబాటులో ఉంచడం, ఆలయాన్ని విద్యుత్ అలంకరణ, క్యూలైన్లులో భక్తుల కోసం షామియానాలు ఏర్పాటు చేయడం, వివిధ డివిజన్‌ల నుంచి పోలీస్ బందోబస్తు, సేవాసమితి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులచే క్యూలైనులో సేవలు, ఉచిత పులిహోర ప్రసాదం, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల తల్లుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. తహసీల్దార్ హరనాథ్ మాట్లాడుతూ ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా ప్రసిద్ద పొందిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలోని నాగపుట్టలో పాలుపోసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిపారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, సర్పంచ్ నందిగం మేరీరాణి, ఎంఆర్‌ఐ కె. విశ్వనాఽథ్, ఎకై ్సజ్ శాఖ నుంచి ఆసిఫ్‌బాబు, అవనిగడ్డ ఆర్‌టీసీ డీఎం హనుమంతరావు, అగ్నిమాపకశాఖ అధికారి సుధాకర్, ఎస్‌ఐ సత్యనారాయణ, ఆలయ సూపరిటెండెంట్ అచ్చుత మధుసూదనరావు, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయ డెప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు