
బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా మనోహర్‌నాయుడు
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా టి.మనోహర్‌నాయుడు(విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్) ఎన్నికయ్యారు. సొసైటీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడిగా జక్కంపూడి ప్రసాద్(జేపీ పబ్లికేషన్స్), కార్యదర్శిగా కె.లక్ష్మయ్య (ప్రజాశక్తి బుక్‌హౌస్), సహాయ కార్యదర్శిగా ఎ.బి.ఎస్.సాయిరామ్(సహస్ర బుక్స్), కోశాధికారిగా కొండపల్లి రవి (నవసాహితి బుక్ హౌస్).. సభ్యులుగా జి.లక్ష్మి, గోళ్ల నారాయణరావు, విశ్వేశ్వరరావు, శిరం రామారావు (వీజీఎస్), బి.రవికుమార్, బి.వి.బసవరాజు, కె.శ్రీనివాస్, వి.శ్రీనివాసరావు, ఎన్.ఎస్.నాగిరెడ్డి, పి.సుబ్రహ్మణ్యం, వల్లూరి శివప్రసాద్, కె.సత్యరంజన్, చలపాక ప్రకాష్ ఎన్నికయ్యారు. పల్లవి పబ్లికేషన్స్ అధినేత ఎస్.వెంకటనారాయణ, ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు.