
వైద్యుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం వెంటనే వైద్యుల సమస్యలు పరిష్కరించి ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ముత్యాలంపాడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు చేపట్టిన సమ్మెను పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. దీనివల్ల ప్రతి రోజు లక్షలాది మంది రోగులకు సకాలంలో వైద్యసేవలు అందటం లేదని చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు వైద్యసేవల కోసం ఎక్కువగా తీవ్ర అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంవల్ల అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కారయదర్శి డాక్టర్ ఎం.ప్రభుదాస్ మాట్లాడుతూ ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి వైద్యుల సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
డాక్టర్ అంబటి
నాగ రాధాకృష్ణ యాదవ్