
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు కొండపల్లి ఎన్టీటీపీఎస్ బి కాలనీ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరగనున్న మహాసభల్లో తొలిరోజు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి నరసింహారావు పతాక ఆవిష్కరణ చేశారు. డేవిడ్ చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై చర్చించారు. భవిష్యత్తులో కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ శ్రీనివాస్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మామిడి శీతారామారావు, కార్యదర్శి యం.మహేష్, కోశాధికారి వాసుదేవన్, జేవీవీ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ మురళీమోహన్, ఉపాధ్యక్షుడు కాశీనాథ్, ఎన్‌సీహెచ్ సుప్రజ, మైలవరం కార్యదర్శి సుధాకర్, ఇర్ల కొండలరావు పాల్గొన్నారు.
సీఐటీయూ 12వ
జిల్లా మహాసభలు ప్రారంభం