
సోషల్ మీడియా పోస్టుల నెపంతో 9 మందిపై కేసు
కంచికచర్ల: సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పోస్టులు పెట్టా రంటూ పోలీసులు కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన 9 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు రైతులు కాగా, ఒకరు జేసీబీ ఆపరేటర్, మరో ఇద్దరు యువకులు చైన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ సీపీలో చురుకై న కార్యకర్తలు. అక్రమ అరెస్ట్‌ల విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు, జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మార్త శ్రీనివాసరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు మంగలపూడి కోటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు నాయకులు రాయల నరసింహారావు, ఎస్సీ సెల్ నాయకులు ముప్పాళ్ల శివాజీ, మాజీ సొసైటీ అధ్యక్షుడు వేమవరపు పురుషోత్తం తదితరులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం తెల్ల వారుజామున ఆందోళన చేశారు. ఆందోళన విషయం కంచికచర్ల, చందర్లపాడు ఎస్‌ఐలు విశ్వనాఽథ్, ధర్మరాజు రూరల్ సీఐ చవాన్‌కు సమాచారం అందించగా ఆయన హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నాయకులను స్టేషన్‌లోకి పిలిచి ఆందోళన విరమించాలని కోరారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, తమకు సహకరించాలని సీఐ కోరారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆందోళన విరమించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిని నందిగామ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
9 మందిపై అక్రమంగా కేసు నమోదు...
మండలంలోని మోగులూరు గ్రామానికి చెందిన 9 మందిని సోషల్ మీడియాలో అధికార పార్టీ నాయకులను కించపర్చారనే ఫిర్యాదు మేరకు అన్యాయంగా అక్రమంగా కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో బండి ఽశ్రీనివాసరావు, కాశిబోయిన భిక్షాలయ్య, బండి రామారావు, బండి నాగశివరావు, రాయల త్రిశాంక్, యర్రగుంట వెంకటేశ్వరరావు, షేక్ మహ్మద్ ఆరీఫ్, షేక్ జాన్‌సైదా, బండి మురళీ చౌదరి ఉన్నారు.
కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన
వైఎస్సార్ సీపీ నాయకులు