
దేవస్థానం అభివృద్ధికి రూ.50 వేలు విరాళం
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానంకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం మంగళవారం విజయవాడ వాస్తవ్యులు సీహెచ్ సత్యనారాయణ, పుష్ప లీలావతి దంపతులు రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అభివృద్ధి నిమిత్తం రూ.50 వేలు విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అర్చకులు బుద్ధు ఫణికుమార్‌శర్మ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంటకాలువలో పడి
వృద్ధుడు దుర్మరణం
కోడూరు: ప్రమాదవశాత్తు కాలు జారి పంటకాలువలో పడి ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ పరిధిలోని ఈబీసీ కాలనీకి చెందిన కొండవీటి అర్జునరావు (62) చిత్తు కాగితాలు సేకరిస్తూ వాటిని విక్రయించి వచ్చిన నగదుతో జీవనం సాగిస్తాడు. రోజూ మా దిరిగానే చిత్తు కాగితాలు సేకరిస్తున్న సమయంలో 11వ నంబర్ పంటకాలువలో ప్రమాదవశా త్తు కాలు జారి పడిపోయాడు. అర్జునరావు కాలువలో పడిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. కాలువ లో మృతదేహం ఉందని స్థానికుల పిర్యాదు మేర కు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు అర్జునరావుగా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
భవానీలకు ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): భవానీలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారన్న అంచనాతో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అధి కారులతో కలిసి బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, సీతమ్మ వారి పాదాలు, వినాయక గుడి ప్రాంతాలలోని హోల్డింగ్ ఏరియాలను, క్యూ లైన్లను నడుచుకుంటూ వెళ్లి పరిశీలించి తగు సూచనలు చేశారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు కేవలం జల్లు స్నానాలు చేయాలని సూచించారు.

దేవస్థానం అభివృద్ధికి రూ.50 వేలు విరాళం