
7 లక్షల క్యూసెక్కులు వస్తున్న వరద నీరు
కంచికచర్ల: ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణానదికి మంగళవారం 7లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు అంటున్నారు. కంచికచర్ల మండలం కొత్తపేట, గనిఆత్కూరు, మున్నలూరు, కునికెనపాడు, చెవిటికల్లు గ్రామాల్లోని పంట పొలాల్లోకి కృష్ణానది వరదనీరు చేరుతోంది. రాత్రికి ఇంకా వరద నీరు పెరిగే అవకాశాలు ఉన్నాయని డెప్యూటీ తహసీల్దార్ వి.మానస తెలిపారు. ఇప్పటికే నదీతీర ప్రాంత ప్రజలు కృష్ణానదిలోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ సిబ్బందిని నదీతీర గ్రామాల వద్ద కాపలా ఉంచామని చెప్పారు. కృష్ణానది తీర గ్రామాల సమీపంలో రైతులు సాగుచేసిన మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలన్నీ నీట మునిగాయి. సుమారు 100 ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లంక భూముల్లో ఉన్న రైతులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీటీ తెలిపారు.

7 లక్షల క్యూసెక్కులు వస్తున్న వరద నీరు