చిట్టినగర్(విజయవాడపశ్చిమ): సహకార సమితిని సమర్ధంగా నడిపించడమే కాకుండా పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు గురువారం పురస్కారాన్ని అందజేసినట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు(ఎన్‌డీడీబీ) ఆరు దశాబ్దాలు పూర్తి కావడంతో గురువారం పుదుచ్చేరిలో వజ్రోత్సవం నిర్వహించింది. ఈ వేడుకలలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాష్‌నాఽథన్, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి సీడీజే కౌమర్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు హాజరయ్యారు.
సెపక్ తక్రా పోటీలకు కృష్ణాజిల్లా జట్ల ఎంపిక
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణాజిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ బాల, బాలికల జట్లను గురువారం ఎంపిక చేసినట్లు ఆ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం. పవన్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 13,14 తేదీలలో అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణాజిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు మావులూరి పవన్ కుమార్, దేవవరపు నరేష్ బాబు, బండి నరేష్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారని తెలిలియజేశారు. బాలుర విభాగంలో ఎండి.జకీర్, ఎస్.కార్తీక్, వై.సుభాష్, వై.అనిల్, ఎండి.ముజాకీర్, బాలికల విభాగంలో వి.కావ్య, ఎండి.రహీమా, కె.లావణ్య, ఆర్.అమృత, ఎస్‌డి.కరిష్మా ఎంపికయ్యారని తెలియజేశారు. జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

కృష్ణా మిల్క్ యూనియన్‌కు ఎన్‌డీడీబీ పురస్కారం