మొండి నొప్పులకు ఫిజియోతో చెక్
మొండి నొప్పులకు ఫిజియోతో చెక్ లబ్బీపేట(విజయవాడతూర్పు): మొండి నొప్పులకు ఫిజియోథెరపీతో చెక్ పెడుతున్నారు. వైద్య రంగంలో నేడు ఫిజియోథెరఫీ కీలకంగా మారింది. మెడనొప్పి, నడుము నొప్పి, పక్షవాతం, వృద్ధుల్లో వచ్చే అల్జీమర్స్, పార్కిన్‌సన్ వంటి వ్యాధులకు ఫిజియోథెరపీతో ఉపశమనం కలిగిస్తున్నారు. గుండె సర్జరీ, కీళ్ల మార్పిడి సర్జరీ, సిజేరియన్ వంటివి చేసిన తర్వాత మజిల్స్ సాధారణ స్థితికి రావడానికి ఇది దోహదపడుతుంది. దీంతో నార్మల్ డెలీవరీ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టు ఉంటున్నారంటే వారి ప్రాధాన్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో ఫిజియోథెరపీ సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అక్కడ అధునాతన పరికరాలతో థెరపీలు చేస్తూ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి..
ఏటా సెప్టెంబరు 8న ప్రపంచ ఫిజియోథెరపీ డేను జరుపుకొంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నిస్తుండగా, ఈ ఏడాది ఆరోగ్య కరమైన వృద్ధాప్యంలో ఫిజియోథెరఫీ, శారీరక శ్రమ పాత్రపై అవగాహన కలిగించనున్నారు. వృద్ధాప్యంలో శారీరక శ్రమ ఎంత ముఖ్యమో, ఫిజియోథెరఫీతో ఎలా ఆరోగ్యంగా వృద్ధాప్యం పొందడానికి, బలహీనతలు అఽధిగమించేలా చేస్తుందో అవగాహన కలిగించనున్నారు. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఈ నినాదంతో డే జరుపుకొంటున్నారు.
ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం ఫిజియోథెరపీ బలహీనతలు అధిగమించేందుకు దోహదం వైద్య రంగంలో కీలకంగా మారుతున్న వైనం దీర్ఘకాలిక నొప్పులకు విముక్తి నేడు ప్రపంచ ఫిజియోథెరపీ డే
భవానీపురానికి చెందిన 48 ఏళ్ల మహిళ లంబర్ డిస్క్ ప్రాబ్లమ్స్‌తో, తీవ్రమైన నొప్పితో బాధపడుతుండేది. ఆమె నాలుగైదు ఆస్పత్రులకు వెళ్లగా సర్జరీ చేయాలన్నారు. ఆమెకు సర్జరీ చేయించుకోవడం ఇష్టంలేదు. తెలిసిన వారి ద్వారా ఫిజియోథెరపిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చేయగా సాధారణ స్థితికి వచ్చింది. వీరిద్దరే కాదు అనేక మంది ఫిజియోథెరఫీతో ఉపశమనం పొందుతున్నారు. పుట్టుకతో వచ్చిన లోపాల నుంచి వృద్ధాప్యం వచ్చే కండరాల బలహీనత, పక్షవాతం వంటి వ్యాధులకు సమర్థంగా చికిత్సలు అందిస్తున్నారు.
పటమటకు చెందిన 15 ఏళ్ల బాలిక గిలియన్ బ్యారీ సిండ్రోమ్(జీబీఎస్)కు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందినా కండరాలు సాధారణ స్థితికి రాలేదు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఫిజియోథెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ థెరపీలతో ఆమె సాధారణ స్థితికి వచ్చింది.
1/1
మొండి నొప్పులకు ఫిజియోతో చెక్