
ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదు
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదని, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధనలు తరతరాలను ప్రభావితం చేస్తున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ కొనియాడారు. నగరంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులకు దక్కిన గౌరవమన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయుల ప్రాధాన్యం, విద్యా విలువలపై ప్రసంగించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను అలరించగా, ఎంపికై న 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీిసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ గంగాధర్, డీఈఓ పీవీజే రామారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఉత్తమ ఉపాధ్యాయుల బాధ్యత
మరింత పెరిగింది
బంటుమిల్లి: ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకుంటున్న గురువులపై మరింత బాధ్యత పెరిగిందని డీఈవో రామారావు అన్నారు. స్థానిక సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్(అప్స) ఆధ్వర్యంలో అవార్డుల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యం నేరవేరాలంటే ఉపాధ్యాయుల్లో అంకితభావం ఉండాలన్నారు. విద్యార్థుల ప్రవర్తన తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలలకు మంచిపేరు తెచ్చేవిధంగా చేయడంలో ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. అనంతరం జిల్లాలోని పలు పాఠశాలల్లో గుర్తించిన ప్రైవేటు టీచర్లలో ఉత్తమ టీచర్లకు అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీవైఈవో బీసీజే శేఖర్‌సింగ్, అప్స జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌరీప్రసాద్, అజ్మతుల్లాఖాన్, సభ్యులు కొమ్మారెడ్డి కిషోర్, సాబూజాన్, కొమరగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సుభాష్

ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదు