
నిమజ్జన వేళ నీటిలో పడి..
కంకిపాడు: కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటనపై శుక్రవారం కేసునమోదైంది. కంకిపాడు ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి తండు సుందర్‌రావు (69) గంగూరులోని విజయ స్పిన్నింగ్‌మిల్లులో రోజు వారీ కూలీగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఇంటి నుంచి సైకిల్‌పై డ్యూటీకి బయలుదేరి వస్తున్నాడు. గంగూరు పెప్పర్ స్కేర్ వద్ద రోడ్డు దాటుతుండగా మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో గాయపడ్డ సుందర్‌రావును కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే సుందర్‌రావు మృతి చెందాడు. వైద్యులు నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.
కోనేరుసెంటర్: మద్యం మత్తులో మాజీ భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అవనిగడ్డ అశ్వరావుపాలెంకు చెందిన మాదివాడ వెంకటసీతారామరాజు మచిలీపట్నం సర్కిల్‌పేటకు చెందిన పద్మజను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ పాప. పద్మజకు రెండో వివాహం కావటంతో ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. పద్మజ ఏడాది క్రితం భర్తను వదిలి కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోయింది. సీతారామరాజు.. కుమార్తెతో అవనిగడ్డలో ఉంటున్నాడు. పద్మజ భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్‌లో వారికి విడాకులు మంజూరైనట్లు బాధితురాలు తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం మద్యం సేవించిన సీతారామరాజు పద్మజ ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో పద్మజను రోడ్డుపై ఆపి ఘర్షణ పడ్డాడు. తనతో రావాలంటూ నిలదీశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన సీతారామరాజు కత్తితో ఆమైపె దాడి చేశాడు. శరీరంపై కత్తితో పలు చోట్ల గీశాడు. గాయాలపాలైన పద్మజ కేకలు పెట్టటంతో సీతారామరాజు పరారయ్యాడు. స్థానికులు గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.