
యూరియా సరఫరాపై అపోహలొద్దు
కొరత లేదు
పామర్రు(మొవ్వ): యూరియా సరఫరా నిరంతరం జిల్లాలో కొనసాగుతుందని.. రైతులు అపోహ పడొద్దని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టర్ శుక్రవారం ఉదయం పంట పొలాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. యూరియా కొరత ఉందని భావించి ఆందోళనకు గురవుతున్న రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. యూరియా సరఫరా, పంపిణీ, వినియోగం స్థితిగతులను ఆరా తీశారు. తొలుత కలెక్టర్ పామర్రు మండలం కురుమద్దాలి, కనుమూరు, జుజ్జువరం గ్రామాల్లో యూరియా సరఫరాపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని కలెక్టర్ రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌తో మాట్లాడుతూ అవసరమైన యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి ప్రస్తుతం యూరియా కావలసినంత అందుబాటులో ఉందని, నిరంతరం పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
చిలకలపూడి(మచిలీపట్నం): యూరియా కొరత కృష్ణాలో లేదని, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల అవసరాలు తీర్చేందుకే ప్రభుత్వం ఉందని సకాలంలో రైతులకు కావాల్సిన యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని ఆయన అన్నారు. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయయరావు, ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ పాల్గొన్నారు.
రైతులతో కలెక్టర్ బాలాజీ