
మెకానిక్‌ల అభివృద్ధికి కృషి చేస్తా
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్‌కు అన్ని విధాలుగా కృషి చేస్తానని గంధం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఏటీఏ హాలులో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ లారీలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన పలు రకాల ఇంజిన్‌లు... పలు కంపెనీలకు చెందిన ఇంజిన్ ఆయిల్‌లతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి లారీల ఇంజిన్‌లు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్నాయని.. వీటి గురించి మెకానిక్‌లకు అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. ఏటా రెండు సార్లు మెకానిక్‌లకు అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు 2025–28 సంవత్సరానికి గాను ఎన్నుకున్న నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి షేక్ దస్తగిర్, కోశాధికారి మైలు రామ్మోహనరావు, ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు,రియాజ్ గాలిబ్, రామకృష్ణప్రసాద్, కనకారావుతో పాటు కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.
ఆటోమొబైల్ మెకానిక్స్
అసోసియేషన్ అధ్యక్షుడు గంధం