
జీవన పోరాటం
గంగపుత్రుల
సముద్రమే వారికి సర్వస్వం... సైనికుడు యుద్ధరంగానికి వెళ్లే ముందు ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకున్నట్టు మత్స్యకారులు నడిసంద్రంలోకి వేటకు వెళ్లే ముందు వలలు అల్లుకుని మరబోటులను సిద్ధం చేసుకుంటారు. ఉదయభానుడి వెలుగురవ్వలు సాగర అలలపై ప్రసరించగానే సంద్రంలోకి పడవలతో ఒక్క ఉదుటున ఉరుకుతారు. నడి సంద్రంలోకి వెళ్లి మత్స్య సంపదను కొల్లగొట్టుకు వచ్చి విజయగర్వంతో ఒడ్డుకు తిరిగివస్తారు. తెచ్చిన చేపలను విక్రయించి కుటుంబం కడుపు నింపుకొంటుంటారు. దెబ్బతిన్న వలలకు మరమ్మతులకు చేసుకుని మళ్లీ మరుసటి రోజు యుద్ధానికి సిద్ధమవుతారు. ఇదీ నిత్యం మత్స్యకారుని జీవనచిత్రం. మంగినపూడి బీచ్‌లో శుక్రవారం మత్స్యకారుల కదలికలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది.
– కందుల చక్రపాణి, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ

జీవన పోరాటం

జీవన పోరాటం

జీవన పోరాటం