
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
రామవరప్పాడు: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ సెక్రెటరీ జి.దేవి సూచించారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. రామవరప్పాడు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు, భోజనం నాణ్యత తదితర విషయాలను తెలుసుకున్నారు. రాగి జావ నాణ్యతను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పలు సూచనలు చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలను సందర్శించారు. గొల్లపూడి హైస్కూల్‌లో వంటశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, సివిల్ సప్‌లై అధికారులు, జిల్లా విద్యాశాఖ నుంచి ప్రభాకర్, నిర్మల, వెంకట రమణ, ప్రసాద్ పాల్గొన్నారు.