
అనుక్షణం.. అప్రమత్తం
కోడూరు: ఉగ్రవాదుల పీచమణిచేందుకు పాకిస్తాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో పోలీసు, మైరెన్ శాఖలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని సముద్ర తీరప్రాంత గ్రామాల వెంట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దివిసీమలోని కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సముద్రం వెంట ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్‌ఐలు చాణిక్య, పూర్ణమాధురి సూచించారు. అపరిచిత వ్యక్తులు, అక్రమ చొరబాటుదారులు, బోట్లు సముద్రం వెంట కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని ఆదేశించారు. పాలకాయతిప్ప సముద్ర శింకు వద్ద నిలిపి ఉన్న బోట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోస్టల్ సెక్యూరిటీ అధికారులు కూడా తీరం వెంట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారని, అత్యవసర సమయంలో మత్స్యకారులు కూడా వారికి సహకరించాలని ఎస్‌ఐలు కోరారు.
నిరంతర పర్యవేక్షణ..
పాలకాయతిప్ప బీచ్‌తో పాటు పవిత్ర సాగర సంగమ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాను సముద్రం వెంట కూడా పంపి, అనుమానాస్పద బోట్లపై ఆరా తీశారు. తీరం వెంట ఉన్న మడ చెట్లు, బోట్లతో పాటు కరకట్ట వెంట కూడా డ్రోన్‌తో పర్యవేక్షించారు. ప్రతి రోజు ఈ డ్రోన్ నిఘా ఉంటుందని ఎస్‌ఐలు చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అప్రమత్తమైన పోలీసు, మైరెన్ శాఖలు తీరప్రాంత గ్రామాల వెంట ప్రత్యేక నిఘా