
పోలీసు సిబ్బంది సేవలు అభినందనీయం
కోనేరుసెంటర్: పోలీసుశాఖలో సుదీర్ఘకాలంపాటు విశిష్ట సేవలను అందించిన సిబ్బంది సేవలు అభినందనీయం జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు (అడ్మిన్), ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ కొనియాడారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీసులను ఏఎస్పీలు శనివారం ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా ఏఎస్పీలు మాట్లాడుతూ పోలీసువృత్తిలో మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయన్నారు. వాటన్నింటిని అధిగమిస్తూ సర్వీసులో ఎక్కడ ఎలాంటి రిమార్కు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందడమనేది అదృష్టంగా భావించాలన్నారు. భవిష్యత్‌లో పోలీసుశాఖ తరుపున ఎలాంటి సహాయం అందించటానికైనా తాము సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన జి.వి.ప్రసాద్ రావు(ఎస్సై, గుడివాడ ట్రాఫిక్) ఎన్.ఎన్.పూర్ణచంద్రరావు(ఏఎస్సై, చల్లపల్లి), డి. వీరరాజు (ఏఎస్సై, ఉయ్యూరు), ఎన్.డి. నాగేశ్వరరావు (ఏఎస్సై, ఉంగుటూరు), డి.ఆంజనేయులు (ఏఎస్సై, నందివాడ)లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బందరు డీఎస్పి సిహెచ్ రాజా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు, చిలకలపూడి సీఐ ఎస్‌కే నభీ, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు సతీష్‌కుమార్, రవికిరణ్, పోలీసు అధికారులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.