
యువరాగం కదిలింది.. నవరాగం పలికింది!
విజయవాడ కల్చరల్: సంగీత మూర్తిత్రయంలో ఒకరైన సద్గురు త్యాగరాజ స్వామి 258 వ జయంతి ఉత్సవాలు శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం నాటి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన యువ కళాకారులు నవ రాగం పలికించారు. చింతలపాటి శ్రీదేవి సంకీర్తన, జీవీఆర్ సంగీత కళాశాల విద్యార్థినులు, మల్లాది అనన్య, మల్లాది అభిజ్ఞ, పుష్పాల షణ్ముఖ్, రాగంపూడి అమూల్య, పసుమర్తి సంధ్య, ముడుంబై లక్ష్మి,, డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ త్యాగరాజ కృతులను ఆలపించారు. యువ వేణువు కళాకారులు వనమాలి, మాధవ్ వేణువుపై హృద్యంగా త్యాగరాజ కృతులను ఆలపించారు. శ్రీ సద్గురు సంగీత సభ కార్యవర్గం బీవీఎస్ ప్రకాష్, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాథ్, ప్రసాద్ శర్మ, వీఆర్ సుబ్రహ్మణ్యం, శారదా దీప్తి పాల్గొన్నారు. యువ సంగీత కళాకారులను నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు.

యువరాగం కదిలింది.. నవరాగం పలికింది!