సంబరాల సారె! | - | Sakshi
Sakshi News home page

సంబరాల సారె!

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

బతుకమ్మ చీరల పంపిణీకి సన్నద్ధం ఇప్పటికే మూడు గోదాముల్లో భద్రం చిలకపచ్చ వర్ణంలో రెండు సైజుల్లో.. మహిళల మనసు దోచేలా తయారీ తొలుత పొదుపు సంఘాల వారికే..

కౌటాల: తెలంగాణ సంస్కృతిక ప్రతీక.. అతివలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల రోజు నుంచి సద్దుత బతుకమ్మ దాకా మహిళలు చేసే సందడి కనుల విందే. ఉదయం పూలు తేవడం.. బతుకమ్మలను పేర్చడం.. సాయంత్రం పాటల కోలాహలంతో బతుకమ్మను కీర్తించడం సంప్రదాయానికి ప్రతీతి. చిన్నారుల నుంచి వృద్ధ మహిళల వరకు బతుకమ్మ ఆడనుండగా లోగిళ్లన్నీ సందడిగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అతివలకు పండుగ కానుకగా ఉచితంగా బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి చిలకపచ్చ రంగులో చీరలు వచ్చేశాయి. ఈ నెల 11నుంచి ఎంగిలి పూలతో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

మొదట ఎస్‌హెచ్‌జీ సభ్యులకే..

ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరిట మొదట మహిళా సంఘా ల సభ్యులకు చీరలివ్వనున్నారు. అనంతరం 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ పంపిణీ చేయనున్నా రు. జిల్లాలో 1.08 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు సంఘాల్లో లేని మహిళలు 20వేల మంది వరకు ఉన్నా రు. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలు తయారు చే యగా.. ఒక్కో మహిళకు ఒకటి చొప్పున పంపిణీ చే యనున్నారు. గతానికి భిన్నంగా చీరలు తయారు చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.500కు పైగా ఖర్చు కాగా.. మ గువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లను జో డించారు. బంగారు, వెండి జరీ అంచు చీరలు, చెక్స్‌ డిజైన్లు ఈసారి ప్రత్యేకమంటున్నారు. ప్రభుత్వం అందించనున్న చీరలు చేనేతవి కావడమే కాకుండా చాలా మన్నికగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

జిల్లాకు చేరిన 37,944 చీరలు

జిల్లాకు ఇప్పటికే 37,944 చీరలు వచ్చా యి. మిగతావి త్వరలోనే వస్తాయని అ ధికారుల చెబుతున్నారు. జిల్లా గ్రామీ ణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వీటిని కౌ టాల, జైనూర్‌, రెబ్బెన మండలం రాంపూర్‌లోని గోదాంలలో భద్రపర్చారు. గోదాంల నుంచి ఆయా గ్రామాలకు అవసరం మేరకు సరఫరా చేస్తారు. ఇప్పటికే జిల్లాలోని మహిళా సంఘాలు, సభ్యుల సంఖ్య, ఏయే ప్రాంతాలకు ఏ మేరకు సరఫరా చేయాలనే వివరాలు మెప్మా, సెర్ప్‌ సిబ్బంది సేకరించి ఉన్నతాధికారులకూ నివేదించారు.

పండుగలోపు

పంపిణీ చేస్తాం

బతుకమ్మ కానుకగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులతోపాటు 18ఏళ్లు నిండిన మహిళలందరికీ ప్రభుత్వం ఉచితంగా చీరలు అందించనుంది. ఇప్పటికే జిల్లాకు 37,944 చీరలు వచ్చా యి. త్వరలో మిగతా చీరలు రానున్నాయి. వీటిని జిల్లాలోని మూడు గోదాముల్లో భద్రపరిచాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం.

– దత్తారావు, డీఆర్డీవో

జిల్లాలో అర్హుల సంఖ్య, చీరల సైజుల వివరాలు

మండలం ఎస్‌హెచ్‌జీ 6.30 మీ. 9 మీ.

సభ్యులు చీరలు చీరలు

ఆసిఫాబాద్‌ 8,007 6,007 2,000

వాంకిడి 8,578 5,500 3,078

రెబ్బెన 8,337 5,137 3,200

తిర్యాణి 5,931 3,781 2,150

జైనూర్‌ 6,647 3,000 3,647

కెరమెరి 5,800 2,500 3,300

సిర్పూర్‌(యు) 3,880 1,680 2,200

లింగాపూర్‌ 3,367 1,367 2,000

కాగజ్‌నగర్‌ 10,884 8,158 2,500

దహెగాం 6,304 3,800 2,504

కౌటాల 7,354 4,861 2,493

సిర్పూర్‌(టి) 6,227 3,700 2,527

పెంచికల్‌పేట్‌ 3,167 1,400 1,767

బెజ్జూర్‌ 5,818 3,600 2,218

చింతలమానెపల్లి 6,067 3,667 2,400

కాగజ్‌నగర్‌ (ము) 8,357 8,327 30

ఆసిఫాబాద్‌ (ము) 2,863 2,613 250

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement