కొనసాగుతున్న వన్యప్రాణి వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వన్యప్రాణి వారోత్సవాలు

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో అటవీశా ఖ ఆధ్వర్యంలో ఈనెల 2న ప్రారంభమైనన జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా 50మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ.. వాటి ప్రాధాన్యత తెలియజేయడం కోసం వారంపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలను భాగస్వాముల ను చేయడమే అటవీశాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై పని చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించాల నే పాఠశాలల్లో ఈనెల 8వరకు వివిధ రకాల పోటీలు నిర్వహస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపా ల్‌ అబ్దుల్‌ రహీం, అటవీశాఖ సెక్షన్‌ అధికారి మహేందర్‌, బీట్‌ అధికారులు సాధిక్‌పాషా, ప్రకాశ్‌, వెంకటేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement