విద్యార్థులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అవగాహన

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

చింతలమానెపల్లి: మండలంలోని ఖర్జెల్లి రేంజ్‌ పరిధి దిందా బీట్‌లోగల కేతిని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఆదివారం క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దిందా బీట్‌లోని 70హెక్టార్లలో సాగవుతున్న ప్లాంటేషన్‌ను సందర్శించారు. అధికారులు అటవీ ప్రాంతంలో విద్యార్థులతో మొక్కలు నాటించారు. అటవీ మొక్కలు, చెట్ల పెంపకం, సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. అడవుల నరికివేత, ఆక్రమణలతో జరుగుతున్న పర్యావరణ నష్టం, కోల్పోతున్న పర్యావరణ సమతుల్యతలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో మాట్లాడుతూ.. వన్యప్రాణులను రక్షించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అటవీ రేంజ్‌ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement