రెబ్బెన: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ వి ద్యను బలోపేతం చేసేందుకు పీఈటీఏ టీ ఎ స్ సంఘం తరఫున కృషి చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్‌గౌడ్, రాష్ట్ర కోశాధి కారి సక్రు నాయక్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీఏ టీఎస్ జిల్లా సమావేశాన్ని నిర్వహించి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సంఘాన్ని బలోపేతం చేసేందుకు కమి టీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అ నంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఈటీఏ టీఎస్ జిల్లా అధ్యక్షుడిగా చ కిలం మధుసూదన్ (పీడీ, సిర్పూర్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా ఎర్ర సత్యనారాయణ (పీడీ, రె బ్బెన జెడ్పీహెచ్‌ఎస్), కోశాధికారిగా ప్రవీణ్ (పీడీ, జన్కాపూర్ జెడ్పీహెచ్‌ఎస్), గౌరవా ధ్యక్షుడిగా బి.మీనారెడ్డి (పీడీ, ఆసిఫాబాద్ బాలికల స్పోర్ట్స్ పాఠశాల), సహాధ్యక్షులుగా ఆత్రం కృష్ణమూర్తి (పీడీ, బంబారా ప్రభుత్వ ఆశ్ర మ ఉన్నత పాఠశాల), మహిళా అధ్యక్షురాలిగా జె.ఇందిర (పీడీ, జెడ్పీహెచ్‌ఎస్ పెట్రోల్ పంప్, కాగజ్‌నగర్) ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.


