సమస్యలపై మౌనంగా ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై మౌనంగా ఉండొద్దు

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: సమస్యలు వస్తే మహిళలు మౌనంగా ఉండొద్దని, ధైర్యంగా ఎదుర్కొనాలని డీఎస్పీ వహీదుద్దీన్‌ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో కొనసాగుతున్న ఉచిత కోచింగ్‌ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ఈవ్‌ టీజింగ్‌, వేధింపులు, గృహహింస, సైబర్‌ నేరాలపై డయల్‌ 100, 112 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. షీటీమ్‌లు, భరోసా కేంద్రాలు మీ కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. ఒంటరిగా వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులకు లొకేషన్‌ షేర్‌ చేయాలని సూచించారు. అపరిచితులతో చాటింగ్‌, ఫొటోలు పంపించడం, ఓటీపీలు చెప్పడంతో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టౌన్‌ ఎస్‌హెచ్‌వో ప్రేమ్‌కుమార్‌, ఎస్సై రాజు, ఎంఈవో ప్రభాకర్‌, షీటీమ్‌ ఇన్‌చార్జి సునీత, సిబ్బంది రమాదేవి, శ్రీనివాస్‌, సునీత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement