కెరమెరి: రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని గోయగాం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ కృషితోనే మనకు నేడు రాజ్యాంగ హక్కులు లభించాయన్నారు. ఆయన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. మహనీయుడి విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ అనిల్, సర్పంచ్ ఆనంద్‌రావు, గ్రామ పటేల్ శంకర్, నాయకులు అశోక్, మునీర్ అహ్మద్, నగరారే తారు, తారక్ సండే ఆనంద్‌రావు, శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు.


