కాగజ్‌నగర్‌టౌన్: మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో బుధవారం మేడే పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాడాలన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లు అమలు చేయడం సరికాదని హితవు పలికా రు. ఈఎస్‌ఐ, పీఎఫ్ ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, బోనస్ చట్టాలపై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధార్థ, సాయి, బురాణ్, ఇమ్రాన్, మీనాక్షి, శారద పాల్గొన్నారు.


