కెరమెరి: పదో తరగతి ఫలితాల్లో మరోసారి గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రంలోని ఐటీడీఏల్లో ఉ ట్నూర్ ఐటీడీఏ ఫలితాల్లో రెండోస్థానంలో నిలిచింది. జిల్లాలో 37 ఆశ్రమోన్నత పాఠశాలలు ఉన్నా యి. మొత్తం 1,302 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 1,276 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 531 మంది, బాలికలు 745 మంది పాసయ్యారు. గతేడాది 93.8 శాతం ఫలితాలు సాధించగా ఈసారి 98 శాతం ఉత్తీర్ణతతో భేష్ అనిపించుకున్నారు. 13 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణ త సాధించడం విశేషం. రొంపెల్లి, పోచంలొద్ది, సల్గుపల్లి, కమ్మర్‌గాం, కేతిని, జైనూర్, మహాగాం, కోహినూర్(కే), పంగిడిమాదర, కంచన్‌పల్లి, రాజీ గూడ సోమ్ని, అనార్‌పల్లి వందశాతం ఫలితాలు సాధించాయి. మిగిలిన 24 ఆశ్రమాలు కూడా 90 శాతానికి పైగా ఉత్తీర్ణతతో సత్తా చాటాయి. లోకేశ్వరి 542 మార్కులతో ఉత్తమ ప్రతిభ చూపింది
ప్రత్యేక ప్రణాళికతో ఫలితాలు
ఐటీడీఏ అధికారులు అమలు చేసిన ప్రత్యేక ప్రణాళి కలు ఫలితాలు ఇచ్చాయి. వందశాతం యాక్షన్ ప్లాన్ అమలు చేయడంతోపాటు వెనుకబడిన వి ద్యార్థులను దత్తత తీసుకుని ఉదయం 5 నుంచి 7 వరకు, సాయంత్రం 7 నుంచి 10 వరకు ప్రత్యేక త రగతులు నిర్వహించారు. రెండుసార్లు గ్రాండ్ టెస్టులు, ఒక్కో సబ్జెక్టుకు 30 స్లిప్ టెస్టులు నిర్వహించా రు. సీ, డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి శ్రద్ధ చూపడంతో ఉత్తమ మార్కులు సాధించగలిగారు.


