దహెగాం/రెబ్బెన: రాష్ట్రంలో ఇంధన కొరత వదంతులు వ్యాపిస్తుండగా.. జిల్లాలోని పలు పెట్రోల్ బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. దహెగాంలోని ఓ పెట్రోల్ బంకులో సుమారుగా వారం రోజుల నుంచి నోస్టాక్ బోర్డు పెట్టారు. మ రో బంకులో పెట్రోల్ ఉన్నా మిషనరీలు పనిచేయడం లేదు. వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా, ప్రైవేట్ వ్యాపారులు లీటరు రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. రెబ్బెన మండలంలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా మంగళవారం పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదంటూ నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. గోలేటి విలేజ్‌లోని బంక్‌లో పెట్రోల్, డీజిల్, గోలేటి ఎక్స్‌రోడ్‌లోని బంకులో పెట్రోల్ అందుబా టులో లేదు. ఈ బంకులో బుధవారం మధ్యాహ్నం వరకు సరిపోయేంత స్టాక్ మాత్రమే ఉంది. నక్కలగూడ సమీపంలోని బంకు కొన్ని రోజులుగా మూసి ఉంటోంది. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న బంకులోనూ స్టాక్ అంతంత మాత్రంగానే ఉంది.


