వేడి.. ఉక్కపోత | - | Sakshi
Sakshi News home page

వేడి.. ఉక్కపోత

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

కౌటాల/దహెగాం: ఎండలకు జిల్లా అగ్నిగోళంలా మండుతోంది. గడిచిన మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నా యి. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉదయం 9 గంటల నుంచే ప్రజలు చెమటతో తడిసిపోతున్నారు. మంగళవారం కెరమెరిలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆసిఫాబాద్‌ 45.1, కుంచవెల్లి 44.8, సిర్పూర్‌(టి) 44.6, ధనోరా 44.2, వాంకిడిలో 44.0 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు ఎండల తీవ్రతతో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం దహెగాం మండల కేంద్రంలో నిర్వహించిన వారసంతలో డేరాలు వేసుకోవడంతోపాటు గొడుగు పట్టుకుని కూరగాయలు విక్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement