ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

కెరమెరి: ద్విచక్ర వాహనం నడిపేవారితో పా టు వెనుక కూర్చొనే వ్యక్తులు సైతం హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. మండలంలోని ఆగుర్‌వాడ గ్రామంలో మంగళవారం అరైవ్‌– అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ రోజా, గ్రామస్తుల సహకారంతో పోలీసుల ఆధ్వర్యంలో వంద హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడు తూ రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్‌ ప్రాణాలు కాపాడుతుందని తెలిపారు. గ్రామస్తులతో రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ ఎస్సై మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement