రెబ్బెన: సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి అన్నారు. 140వ మే డే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్, స్టోర్స్, ఎంవీటీసీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు పోటీల్లో ఉత్సా హంగా పాల్గొన్నారు. విజేతలకు వర్క్‌షాప్ డీజీఎం జ్ఞానేశ్వర్, ఇంజినీర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఆర్గనైజింగ్ కార్యదర్శి శేషశయనరావు, కిరణ్, మారం శ్రీనివాస్, కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


